
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ నుండి హైదరాబాద్ వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారి మరమ్మతులు పూర్తి అయ్యాయని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు జాతీయ రహదారి దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దారి మళ్లింపు చేపట్టారు. ఇకనుండి దారి మళ్లింపు ఉండదన్నారు. ఆర్మూర్ నుండి హైదరాబాద్ వెళ్లేవారు కామారెడ్డి మీదుగా వెళ్ళవచ్చన్నారు. కావున ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సూచించారు.