
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్ శాంతినికేతన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని సీఐ సత్యనారాయణ గౌడ్ దర్శించుకున్నారు. గత 63 సంవత్సరాలుగా గణపతిని ప్రతిష్టించడం అభినందనీయమన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అదేవిధంగా నిమజ్జనం శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. అనంతరం సీఐ సత్యనారాయణ గౌడ్, విగ్రహ దాత చౌల్ సాయి శ్రీనివాస్ శాంతినికేతన్ సభ్యులతో కలిసి పూజలు చేశారు. శాంతినికేతన్ సభ్యులు సీఐను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ మండలి సభ్యులు పాల్గొన్నారు.