
జయ్ న్యూస్, ఆర్మూర్: సెప్టెంబర్ 01: బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆర్మూర్ పట్టణ దోండి రమణ అన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం శ్రమిస్తూ కృషి చేస్తున్న ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అటవీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా థోండి రమణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42% వర్తించేలా సామాజిక ఆర్థిక న్యాయం జరిగేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి గెజిట్ ఇవ్వాలని, బలహీన వర్గాలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో కేబినెట్ సమావేశం ద్వారా నిర్ణయం తీసుకొని బలహీన వర్గాల ప్రజా ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ఆర్మూర్ పట్టణ ఓబీసీల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఆర్మూర్ అభివృద్ధికై అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి ధన్యవాదలు తెలిపారు. రాబోవు సంస్థ గత ఎన్నికల్లో అధిక మొత్తంలో బీసీల ను ఎన్నుకొని మున్సిపాలిటీ కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క, సభలో ప్రవేశపెట్టారు. ఓబీసీ పట్టణ అధ్యక్షులు థోండి రమణ మాట్లాడుతూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ బిల్ ఆమోదం తెలిపిన శాసన సభ అధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు