
జయ్ న్యూస్, ఆర్మూర్: నియోజకవర్గంలోని బీసీ వర్గానికి చెందిన ER ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ హైదరాబాదులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రితో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన BRS పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశారు. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు ఉన్నాయని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఇటీవల బిఆర్ఎస్ లో చేరికల పరంపర పెరగడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.