
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త, క్రీడాదాత, విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయల విలువగల సైన్స్ ల్యాబ్ మెటీరియల్ వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏనుగు దయానంద రెడ్డి దాతృత్వ భావనతో తొర్లికొండ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ వితరణ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ యొక్క సైన్స్ క్లబ్ మెటీరియల్ వలన విద్యార్థులకు బోధన సులభతరంగా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నారు.
విద్యార్థులకు బోధన ప్రయోగపూర్వకంగా వివరించడానికి ఈ యొక్క సైన్స్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం పదివేల రూపాయల పిలువగల స్పోర్ట్స్ మెటీరియల్ మరియు రెండు లక్షల రూపాయలు విలువగల కంప్యూటర్లను పాఠశాలకు అందజేశారన్నారు.
ఈ సందర్భంగా ఏనుగు దయానంద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క మెటీరియల్ పాఠశాలకు ఇవ్వడంలో కృషి చేసినటువంటి జైడి రాజ్ కుమార్, చిట్టాపూర్ గణేష్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగామోహన్ లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, డా నరసింహారావు, మర్కంటి గంగా మోహన్, పల్లె గంగాధర్ మరియు ఓఎస్ శేఖర్ లు పాల్గొన్నారు.