
జయ్ న్యూస్, ఆర్మూర్: నిజామాబాద్ పద్మశాలి సంఘ హాస్టల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కొండి రమేష్, ఉపాధ్యక్షుడిగా కూరపాటి రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు వారి ప్యానెల్, తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చారు. ER ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. తమకు మద్దతు తెలిపాలని ఆయనను కోరారు. అనంతరం పద్మశాలి వంశవృక్షం క్యాలెండర్ ను బహుకరించారు.