
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్బా చిలుకవ్వ కుటుంబ సభ్యులకు 23వేల CMRF చెక్కులు పంపిణీ చేసామని కాంగ్రెస్ నాయకులు యోగిత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ CMRF పథకం పేద ప్రజలకు వరంగా మారిందన్నారు. చెక్కు మంజూరుకు కృషిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్నవారు CMRF పథకానికి సరైన ధ్రువపత్రాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.