
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ASI నుండి SI లుగా ఇద్దరూ ప్రమోషన్ పొందిన వారిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. వారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిశారు. పదోన్నతి పొందిన వారు బాలశౌరి రాజు, ట్రాఫిక్ పిఎస్ నుండి నిజామాబాద్ కమిషనరేట్ కు, మరొకరు దయాల్ సింగ్, నిజామాబాద్ రూరల్ పిఎస్ నుండి నిర్మల్ జిల్లా అని తెలిపారు.