
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మామిడిపల్లి చౌరస్తా, యోగేశ్వర్ కాలనీలలో రోడ్లు జలమయం కావడంతో అప్రమత్తమైన పట్టణ సీఐ సత్యనారాయణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను, ప్రయాణికులను రోడ్డు దాటించారు. సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ పలుచోట్ల ట్రాఫిక్ అంతరం ఏర్పడిందని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని వెల్లడించారు. తక్షణమే స్పందించిన పోలీసుల సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.