
జయ్ న్యూస్, మాక్లూర్: మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో కబడ్డీ పోటీలను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్రాద్ తండావాసులు, నాయకులు, కబడ్డీ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడాకారులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.