
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకున్నారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి అంకాపూర్ గ్రామంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలాగే ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం లారీని పట్టుకున్నారని తెలిపారు. 280 బస్తాలు బరువు 145 క్వింటాలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. విజిలెన్స్ డీటీలు వినోద్, శ్రీనివాస్, ఎస్సై గోవింద్ ఉన్నారు.