
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దేగాం ప్రమోద్ వారితో భేటీ అయ్యారు. వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు. పలు అంశాలపై వారితో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకపోడ్ జిల్లా కార్యదర్శి అరుణ్, జిల్లా నాయకులు తదితరులున్నారు.