
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ స్థానాలకు ముగ్గురు చొప్పున పేర్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, AMC వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్, ఆలూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.