
జయ్ న్యూస్, మాక్లూర్: మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన పందిరి నగేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని వినయ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ధర్మోరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు చాకలి సాయమ్మ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.