
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన పలువురు బిజెపి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… పార్టీ కండువా కప్పుకున్న వారిలో బిజెపి పార్టీ నుండి బండారి తిరుపతి, ప్రశాంత్, బిఆర్ఎస్ పార్టీ నుండి మామిడి చంద్రశేఖర్ మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది….ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి పోచన్న, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రవీణ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ మట్ట, సంజీవ్ మట్ట, అజయ్, సాయి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, గంగారం, దేవేందర్, గంగారెడ్డి, పెద్దోళ్ల సాయ రెడ్డి, మట్ట భూమన్న తదితర నాయకులు పాల్గొన్నారు.