జయ్ న్యూస్, నిజామాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూ, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ లోని పెన్షనర్ల భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టం మూలంగా పెన్షనర్లకు ఇకపై డిఎ లు కానీ పెన్షన్ రీవిజన్ గాని జరిగే అవకాశం లేదని ఆయన ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల పై ఇది సరాఘాతమని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీ పాత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అందరూ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి సాంబ శివరావు జిల్లా నాయకులు జార్జ్, లలిత, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, బాల దుర్గయ్య, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
