జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ లో mptc/zptc ఎన్నికలలో నియుక్తులైన ప్రిసైడింగ్ అధికారులకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికార్లకు డివిజన్ స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ శ్రీ అభిగ్యాన్ మాలవ్య IAS పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎన్నికలు సజావుగా సాగాలి.. కాబట్టి ఎన్నికలలో పాలుపంచుకున్నా మీరందరూ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ dy CEO సాయన్న, DLPO శివకృష్ణ, ఆర్మూర్ MPDO శివాజీ, భీమ్గల్ MPDO సంతోషకుమార్, ఆలూర్ MPDO గంగాధర్, బాల్కొండ MPDO విజయ భాస్కరరెడ్డి, MPO శ్రీనివాస్, MEO రాజగంగారం, RP లు గంట అశోక్, రాము, సంగెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
