జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆల్ఫోర్స్ నరేంద్ర హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. నిన్న ఆర్మూర్ పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు అష్మీర, ప్రవీణ్యా రెడ్డి, శైనిత్, నైనిక, హేమంత్ లను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఆల్ఫోర్ విద్యార్థులు చదువుతోపాటు, క్రీడారంగంలోనూ ముందుంటారని అన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
