జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభించామని పాఠశాల ప్రిన్సిపల్ రజని కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా AGM శివాజీ హాజరయ్యారు. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విద్యార్థులందరికి రకరకాల క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణ విద్యాసంస్థలు చదువులోనే కాదు అన్ని రంగాలలో ముందుంటాయని తెలిపారు. విద్యార్థుల శారీరక ఎదుగుదలకు క్రీడలు అవసరమని తెలిపారు. ఈ ఆటలలో పాఠశాల కోఆర్డినేటర్స్ రాకేష్, ఆజిమ, కల్పన, పాఠశాల డీన్ చిన్నరాజు, శైలజ, స్రవంతి పాఠశాల AO నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు మీనా, మోహన్, మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
