జయ్ న్యూస్, ఆలూర్: నిన్న పాత కలెక్టర్ గ్రౌండ్ లో జరిగిన అండర్ 14 ఇయర్ సబ్ జూనియర్ కబడ్డీ విభాగంలో ఆలూరు పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న శ్రీనిత్ ఆ యొక్క టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాలకు సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ఉమ్మడి జిల్లాల సబ్ జూనియర్ అండర్ 14 ఇయర్స్ బాయ్స్ కబడ్డీ విభాగంలో శ్రీనిత్ పాల్గొని రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపిక కావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపిక కాబడ్డ శ్రీనిత్ 16వ తేదీ నుంచి సంగారెడ్డిలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటాడు. రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపిక అయినందున ఆలూరు మండల విద్యాశాఖ అధికారి అదేవిధంగా ఆలూరు పాఠశాల హెచ్ఎం నరేందర్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ లు అభినందించారు. ఎంఈఓ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని మరి భవిష్యత్తులో ఇలాంటి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్వత్ అహ్మద్ వీరిని అభినందించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామ వీడికి సభ్యులు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ ని కబడ్డీలో మంచి ప్రతిభ కనబరిచిన శ్రీనిత్ ను అభినందించారు.
