జయ్ న్యూస్, డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు అధిక సంఖ్యలో సన్నదమవుతున్న అభ్యర్థులను పరిశీలించి గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గ్రంథాలయ అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే పాఠకులు కోరిన పుస్తకాలు గ్రంథాలయానికి సరఫరా చేస్తామని తెలిపారు.
