జయ్ న్యూస్, ఆర్మూర్: నిజామాబాద్ (ఆర్మూర్) – అక్టోబర్ 21, 2025 – JNTU హైదరాబాద్‌తో అనుబంధ కళాశాల క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (KCEA) బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సుధాకర్ మాడవేడిని థాయిలాండ్‌లోని షినావత్ర అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (SIU) హానరరీ రీసెర్చ్ ఫెలోగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. అక్టోబర్, 2025 నుండి డిసెంబర్ 2028 వరకు ఈ విశ్వవిద్యాలయ రీసెర్చ్ ఫెలోగా డాక్టర్ సుధాకర్ మాడవేడి కొనసాగనున్నారు. ఈ నియామకం క్షత్రియ కాలేజీ యొక్క నాణ్యమైన మానవ వనరుల చిహ్నంగా భావిస్తున్నాము. డా. సుధాకర్ మాడవేడి రీసెర్చ్ ఫెలోగా నియామకం ప్రపంచ విద్యపరమైన సహకారం మరియు జ్ఞాన మార్పిడికి వేదికను అందిస్తుందని భావిస్తున్నాము. ఈ ప్రతిష్టాత్మక నియామకం ద్వారా డా. సుధాకర్ SIU ఫ్యాకల్టీతో ఉమ్మడి పరిశోధన మరియు ప్రచురణ ప్రాజెక్టులలో పాల్గొంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను పర్యవేక్షిస్తారు, అంతర్జాతీయ విద్యా వేదికలలో పాల్గొంటారు. డా.సుధాకర్ ప్రస్తుతం ఇంటి (INTI) ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మలేషియానందు రీసెర్చ్ ఫెలోగా కొనసాగుతున్నారు.


ఈ నియామకం కళాశాల విద్యా నైపుణ్యం మరియు నాణ్యత పట్ల తన నిబద్ధతకు ధృవీకరణగా భావిస్తున్నామని డా. సుధాకర్ మాడవేడిని అభినందిస్తూ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. కార్యదర్శి అల్జాపూర్ దేవేంధర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస్ మరియు సిబ్బంది డా. సుధాకర్ మాడవేడిని అభినందించారు.
