జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ 19వ వార్డు ఇంచార్జ్, యువజన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ గురువారం ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అరవింద్ అనే యువకునికి నూతన సైకిల్ ను అందజేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా ఓ పేదవానికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని విజయ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో తన వంతుగా చేస్తుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు.
