జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండల ఎంపీడీవో సంతోష్ కుమార్ బాబా నగర్ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ కొత్త పనుల గుర్తింపు గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు చేపట్టవలసిన పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అలాంటి పనులనే గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. వ్యక్తిగత పనులు అయినటువంటి పశువుల షెడ్లు, ఇంకుడు గుంతలు, పండ్ల తోటల పెంపకాలు, రైతు భూముల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి రమ్య, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి దాస్, ఫీల్డ్ అసిస్టెంట్ వినోద్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
