జయ్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు శనివారం ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ప్రమోద్ విధినిర్వహణలో హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ గౌరవ అధ్యక్షుడు నరసింహులు గౌడ్, అధ్యక్షుడు రమణా గౌడ్, రాష్ట్ర నాయకులు దాసరి మూర్తి, నారా గౌడ్, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, నరేష్, తదితరులు ఉన్నారు.
