జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ పట్టణంలో కర్నె పల్లి బైపాస్ రోడ్డులో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు, నాయకులు మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు మంచి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్స అనంతరావు, వీడిసి అధ్యక్షులు నీలం రవి, నల్లూరి శ్రీనివాస్, లక్ష్మణ్, రాము, తోట సతీష్, శివకృష్ణ, శివగంగాధర్, కర్ని గంగయ్య, శ్రీకాంత్, కర్నె రాజేశ్వర్, కర్నె మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
