జయ్ న్యూస్, నిజామాబాద్: ★తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనాలని ప్రజావాణిలో ఫిర్యాదు-RSP
★నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి-RSP
నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ ప్రజావాణిలో ( RSP )పార్టీ ఆధ్వర్యంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలనే వినతి పత్రం అందజేశారు.రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ జిల్లా పరిధిలో కురిసిన అకాల వర్షాల వలన వేలాది మంది రైతుల కష్టార్జిత పంటలు తడిసి పాడవుతున్నాయి. పంటను రక్షించుకునే స్థితిలో రైతులు లేరు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆర్థిక నష్టం తీవ్రంగా పెరుగుతోంది. అందువల్ల, మా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) తరఫున ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగానికి విన్నవించుకుంటున్నది ఏమిటంటే
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు భరోసా కల్పించాలి.
ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాములు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.500 బోనస్‌ను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని
ప్రజా ప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రఫీ ఉద్దీన్, సయ్యద్ ఖలేం, గోపాల్ సింగ్ ఠాగూర్, శివ తదితరులు పాల్గొన్నారు
