జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పంప్ హౌస్, పోచంపాద్) ను సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆనకట్ట నిర్మాణ విధానం, నీటి ప్రవాహ నియంత్రణ వ్యవస్థలు, పంపింగ్ స్టేషన్ల కార్యకలాపాలు ,విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు.

కళాశాల సివిల్ హెచ్ఓడీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ —“ఈ తరహా ఇండస్ట్రియల్ విజిట్స్ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించి, క్లాస్‌రూమ్‌లో నేర్చుకునే సిద్దాంతాన్ని వాస్తవ ప్రాజెక్ట్‌లతో అనుసంధానించుకోవచ్చు. ఇది భవిష్యత్తు ఇంజినీర్లకు ఎంతో ఉపయోగకరం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్, కళాశాల AO నరేందర్, CIVIL HOD రాజ్ కుమార్, అధ్యాపకులు సతీష్,కిరణ్,సాయి రేఖ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
