జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణoలో నారాయణ పాఠశాలలో SLC కార్యక్రమన్ని ఘనంగా జరుపుకున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి తెలిపారు. ఈ కార్యక్రమములో SLC యొక్క ప్రధాన ఉద్దేశ్యం చిన్నారులు తమ అభ్యాస ప్రయాణాన్ని స్వయంగా అర్థం చేసుకోవడం, ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడం మరియు వారు నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రలు, ఉపాధ్యాయులతో పంచుకోవడం.. అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ బలాలు మరియు బలహీనతలను గుర్తించగలరు. స్వయంగా తమ ప్రగతిని అంచనా వేయగలరు, భవిష్యతే లక్ష్యాలను నిర్ణయించగలరు. బాధ్యతాయుతమైన అభ్యాస పద్దతిని అలవర్చుకుంటారు. మరియు తల్లిదండ్రులతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. మొత్తానికి, SLC విద్యార్థులను స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంగా మరియు “బాధ్యత గల అభ్యాసకులుగా తీర్చిదిద్దడమే ముఖ్యలక్ష్యం.. అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను తెలంగాణ విద్యాసంస్థల GM గోపాల్ రెడ్డి, DGM వెంకట రమణ రెడ్డి, AGM శివాజీ, అర్ & డి. హెడ్ స్వాతి లు అభినందించారు. ఈ కార్యక్రమంలో Zco’s రాకేష్ , అజిమా, కల్పనా, వీ.పి. శైలజ, AO నవీన్, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
