జయ్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 29న జిల్లా సీనియర్ క్రీడాకారుల పురుషుల ఎంపికను ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల క్రీడ మైదానంలో మరియు మహిళల ఎంపికను సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్రీడామైదానంలో మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు జిల్లా కోచ్ లు నరేష్ మరియు మౌనికలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
