జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో IBM SkillsBuild మరియు Magic Bus సంయుక్త ఆధ్వర్యంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఐదు రోజుల ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రైనింగ్ ప్రోగ్రాం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా కాలేజీ ఎల్లప్పుడూ నూతన అవకాశాలను అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు మరియు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్ వంటి సామర్థ్యాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాక, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులు టెక్నికల్ మరియు సాఫ్ట్ స్కిల్స్‌లో నైపుణ్యాన్ని పెంపొందించుకోగలరని అన్నారు. కళాశాల AO నరేందర్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మంచి అనుభవం, భవిష్యత్తులో కార్పొరేట్ రంగంలో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా IBM SkillsBuild మరియు Magic Bus సంయుక్త కార్యక్రమం ప్రోగ్రాం మేనేజర్ వేణుగోపాల్, అశోక్ మరియు (AI) ట్రైనర్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ,
ఈ ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) , మరియు ఎమ్లోయబిలిటీ స్కిల్స్ పై ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని, తమ కెరీర్లో విజయాలను సాధించాలని ఆయన సూచించారు. అలాగే, IBM SkillsBuild మరియు Magic Bus సంస్థలు విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కళాశాల TPO (ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్) సునీల్ మాట్లాడుతూ, IBM SkillsBuild మరియు Magic Bus నిర్వహిస్తున్న ఈ సెషన్లు విద్యార్థులలో విశ్వాసాన్ని పెంచి, వారి కెరీర్ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ అధ్యాపకులు HOD లు, కళాశాల సోషల్ మీడియా ఇంచార్జ్ శృతిన్, విద్యార్థులు పాల్గొన్నారు.
