జయ్ న్యూస్, ఆర్మూర్: ఎం.జె. హాస్పిటల్ డాక్టర్ మధు శేఖర్ కి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సేవే మానవతా ధర్మం అనే నినాదాన్ని నిజ జీవితంలో ఆచరించి, అనేక మంది బాధితులకు ఆపన్నహస్తంగా నిలుస్తున్న డాక్టర్ మధు శేఖర్, మీకు జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న “చేయూత” స్వచ్ఛంద సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అనాధలకు ఆధారం, విద్యార్థులకు ప్రేరణ, రోగులకు ప్రాణాధారం అవుతోంది.
మీ సేవా తత్వం సమాజానికి స్ఫూర్తి — మానవతా విలువలతో నిండి ఉన్న మీ ప్రయాణం మరెన్నో జీవితాలకు వెలుగునివ్వలని ఆకాంక్షిస్తున్నామన్నారు. మీ ఆరోగ్యం, ఆనందం, సేవా విస్తారం మరింత అభివృద్ధి చెందాలని చేయూత కుటుంబం మరియు మీ అభిమానులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పింజా అభినవ్ పసుపుల నరేష్ దొండి నిశ్చయ్ దీప్ కన్నం ప్రసాద్ లక్ష్మణులు పాల్గొన్నారు
