జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని MJ హాస్పిటల్ ఆవరణలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, MJ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధు శేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ER ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని డాక్టర్ మధు శేఖర్ కు శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ వైద్యవృత్తి చాలా పవిత్రమైనదని, డాక్టర్ మధు శేఖర్ వైద్యరంగంలో చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. డబ్బు ముఖ్యం కాదు…. రోగులను బ్రతికించడమే ఆయన ధ్యేయమన్నారు. ఇలాంటి వైద్యులు అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ER ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, ఐడియా సాగర్ తదితరులు ఉన్నారు.
