జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలంలోని గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో గంగాధర్ తో కలిసి తనిఖీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని నర్సరీని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. మొదటి కాలువల నిర్మాణం, త్రాగునీటి నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ అన్నింటిని కూడా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాజలింగం, పంచాయతీ కార్యదర్శి రాజలింగం, ఫీల్డ్ అసిస్టెంట్ పోశెట్టి తదితరులున్నారు.
