జయ్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్య మండల విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ని గురుకుల జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్ ల సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం హాల్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ ఇతర అన్ని గురుకుల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు, ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలల స్కూల్ హెడ్మాస్టర్లు వెంటనే విద్యార్థినీ విద్యార్థుల ఆపార్, యుడైస్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్,యుడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలని అన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్ లు వెంటనే సంబంధిత సాంకేతిక సిబ్బంది, అధికారులను సంప్రదించి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాల్గొని మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఆపార్యుడైస్ పనులను వెంటనే పూర్తి చేయాలని హెడ్మాస్టర్లను ఆదేశించారు.
