జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల – ఆర్మూర్ నందు మంగళవారం “మహిళా వ్యాపార ఆధారిత ఆర్థికాభివృద్ధి” అనే అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాక్యతలుగా ప్రొఫెసర్ కె. రవీందర్ రెడ్డి (డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ తెలంగాణ యూనివర్సిటీ) మరియు డాక్టర్ వై. వేను ప్రసాద్ (అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల- ఆర్మూర్) హాజరయ్యారు. మహిళా వ్యాపారులకు ఆర్థికాభివృది గల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసారు. అదే విధంగా ప్రధాన అతిథుల చేతుల మీదుగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. చంద్రిక రచించిన “తెలంగాణ గ్రామీణ రుణ ప్రాప్తి: ఆర్థిక వియోజనంపై విశ్లేషణ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్. చంద్రిక, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుజాత, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
