జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ కులస్తులు ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహించే వారి కులదైవం భీమన్న దేవుని కళ్యాణం కార్తీక్ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం భీమన్న దేవుని గదలను వదలను గ్రామ పురవీధులలో సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు పిల్లాపాపలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడ్ కులస్తులు పాల్గొని దేవుని గదలను కులస్తుల ఇళ్లల్లోకి గదలను బాల్కొండ మండలంలో గల నాగపూర్ గ్రామ శివారులో ఉన్న గోదావరి నదిలో గదలను జలాభిషేకం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులస్తులు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.
