జయ్ న్యూస్, బోధన్: జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మంగళవారం నాడు బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, షిరిడి సాయి జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతుల నిర్వహణ అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు ఉష్ణోదించరు. కళాశాలలో ప్రిన్సిపాల్ లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారానే నిర్వహణ చేయాలని అన్నారు. విద్యార్థులకు నవంబర్ నెలలోనే సిలబస్ పూర్తి చేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు గమనిస్తూ కళాశాలకు హాజరుకాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న వార్షిక పరీక్షలకు మంచి ఫలితాలను సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ సదులు వెనుకబడిన విద్యార్థులు అందరిని ఉత్తీర్ణులైన బోధన కొనసాగించాలని అన్నారు.
