జయ్ న్యూస్, ఆర్మూర్:ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల ఆయన ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, తదితరులు ఉన్నారు.
