జయ్ న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని TPCC అధికార ప్రతినిధి AB శ్రీనివాస్ చిన్న బుధవారం హైదరాబాద్ నగరంలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హంధన్, పలువురు ప్రముఖులు, తదితరులు ఉన్నారు.
