జయ్ న్యూస్, ఆలూర్: ఈనెల నాలుగవ తేదీన ముప్కాల్ మండలంలో జరిగిన 69వ ఎస్జిఎఫ్ అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ జిల్లా స్థాయి పోటీలలో ఆలూరు పాఠశాల చెందిన వాస్తవ్ అనే విద్యార్థి ఆ యొక్క జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాల కబడ్డీ టోర్నమెంట్‌కు సెలెక్ట్ కావడం జరిగింది. ఈనెల 5వ తేదీన కామారెడ్డి బాయ్స్ హై స్కూల్ లో జరిగిన ఉమ్మడి జిల్లాల కబడ్డీ సెలక్షన్స్ లో ఈ విద్యార్థి పాల్గొని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ఆలూరు పాఠశాల పిడి రాజేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపిక పట్ల ఆలూరు మండల ఎంఈఓ మరియు ఆలూరు పాఠశాల హెడ్మాస్టర్ నరేందర్ జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచినందుకు విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు వీడిసీ సభ్యులు ఆ యొక్క విద్యార్థికి అభినందనలు తెలిపారు.
