జయ్ న్యూస్, ఆర్మూర్: మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గురువారం పరిశీలించారు. అలాగే పట్టణంలోని 31వ వార్డులో జరుగుతున్న సీసీ కల్వర్టు పనులను, పెర్కిట్, మామిడిపల్లిలో పబ్లిక్ టాయిలెట్ల కొరకు అనువైన స్థలం పరిశీలన చేశారు. పెర్కిట్ జంక్షన్ వద్ద హై మస్ట్ లైట్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలం కొరకు పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
