జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో 150 వందేమాతర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10 గంటల సమయంలో జాతీయ గేయాన్ని ఆలపించడం జరిగింది. 150వ అక్షర సంఖ్యతో విద్యార్థులు పిరమిడ్ వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ 150వ వందేమాతర వేడుక జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు అయిందని వందేమాతరాన్ని బంకించంద్ర చటర్జీ రచించారని, అంతేకాకుండా జాతీయ గేయం భారతీయ సమైక్యతను దేశభక్తిని ఐక్యతను సూచిస్తుందని అంతేకాకుండా వందేమాతరం అంటే తెలుగు తల్లి నీకు వందనం అని విద్యార్థులకు చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేశారు పాఠశాల ప్రాంగణంలో వందేమాతరం గేయం ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
