జయ్ న్యూస్, మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రజా నిలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మనమందరం మద్దతుగా ఉందామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లడ్డు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, AMC డైరెక్టర్ నవీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్, దేవేందర్, శ్రీనివాస్, ఎంసీ గంగాధర్, సుంకేట్ రాజేష్, నాగభూషన్, దొనకల్ రవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
