జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీబాషిత స్కూల్ కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర యాజమాన్య సంఘం (ట్రస్మా) జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకులు, జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పోలపల్లి సుందర్ స్పష్టం చేశారు. విద్యాభివృద్ధిలో జిల్లాలోని విద్యార్థులను, విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
