జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం ఈ ఆదివారంతో 28వ వారానికి చేరుకుందని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట అనే నినాదంతో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం మామిడిపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని వివరించారు.
