జయ్ న్యూస్, డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆదివారం ఉదయం డిచ్పల్లి శాఖ గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం నిర్వహణ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రంథాలయంలో అందుతున్న సేవలు గురించి ఆరా తీసారు. గ్రంధాలయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై పాఠకులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
