జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: విద్యార్థి అమరవీరులను స్మరించుకొని జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థి అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పిడిఎస్యు నిర్మాత అరుణతార జార్జిరెడ్డి సినిమాను విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, PDSU జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షురాలు మమత నాయకులు చరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.
