జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మరియు ఫౌండేషన్ సభ్యులు గ్రామంలోని అంక్సాపూర్ దేవేందర్ ఇంట్లో ప్రేమ పూర్వకంగా పలువురు ప్రముఖులను కలుసుకొని, ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మరియు సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాజశేఖర్ ని ప్రముఖులు అభినందించారు. అనంతరం మెడికల్ ప్రభాకర్, నాగభూషణం వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకం కలిశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అక్షర క్రమంలో ముందున్న అంకాపూర్ గ్రామం వ్యవసాయ రంగంలో ముందుండి, ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే పేరుగాంచిందన్నారు. సేద్యంలో అత్యాధునిక పద్ధతిలో పంటలు పండించడంలో వారి కృషి అద్భుతమన్నారు. వ్యవసాయ రంగంలోనే గాక ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంలో కూడా ఈ గ్రామం ముందు నిలుస్తుంది అన్నారు. పలు రకాల సేవ కార్యక్రమాలు పౌండేషన్ ద్వారా చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. రాబోయే రోజులలో రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, ఆదర్శ రైతు మచ్చర్ల సాయన్న, పడకంటి చిన్న లింగన్న, మారా చిన్న గంగారెడ్డి, మారా సుధీర్ రెడ్డి, ఎంపీ గంగారం, మచ్చర్ల సంతోష్, మాజీ సర్పంచ్ పెర్కిట్ రవి, వన్నెల్ మోహన్ రెడ్డి, అల్లూరి నారాయణరెడ్డి, అర్గుల్ నరసయ్య, సుంకం నాగభూషణం, సుంకం జగదీష్, గంగామణి, గడ్డం మెడికల్ ప్రభాకర్, జగదాంబ శేఖర్, భూమేశ్వర్, పట్వారి గోపికృష్ణ, పట్వారి తులసి, డిష్ రాంప్రసాద్, నూకల శేఖర్, కొండి రామచందర్, నారా గౌడ్ భవాని శ్రావణ్ , కర్త నవీన్, బ్యాంక్ నవీన్, జీవన్ , చందు , దోమల శ్రీనివాస్ , దాసరి సత్యనారాయణ, దోండి గంగ మోహన్, జనతా ఎంటర్ప్రైజెస్ అహ్మద్ భాయ్, ఇస్తా కుదిన్, ఉప్పులూరు వెంకట్, తుకారం, కె.వి రమణ, గట్టడి తుకారం, , క్రాంతి, ఇమ్రాన్, ఇలియాస్, అఫ్రోజు, తదితరులు పాల్గొన్నారు.
