జయ్ న్యూస్, ఆలూర్: ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని BJP నాయకులు అన్నారు. బుధవారం ఆలూరు మండలం రామచంద్రపల్లిలో MLA కృషితో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు BJP నాయకులు ముగ్గు పోసారు. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల తరపున MLA రాకేష్ రెడ్డికి BJP నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహేష్, సాయిలు, పోశెట్టి, రాజన్న, భూషణ్, సతీష్, సురేష్, తదితరులు ఉన్నారు.
